మాగనూరు/కృష్ణ, డిసెంబర్ 19 : తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా రైతుల మధ్య ధా న్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తున్నది. కొ ద్దిరోజులుగా కర్ణాటక ధాన్యాన్ని తెలంగాణలో అమ్మకానికి తీసుకురాగా.. అధికారులు, పోలీసులు బార్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలను అ డ్డుకుని వెనకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు గురువారం కర్ణాటకలోని రాయిచూరుకు ధాన్యం లోడుతో వెళ్తున్న వాహనాలను నారాయణపేట జిల్లా కృష్ణ బార్డర్ చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు.
ఈ క్రమంలో తెలంగాణ ధాన్యాన్ని కర్ణాటకలో అమ్ముకునేందుకు వీల్లేదంటూ గురువారం ఉదయం 7 గంటలకు 60 నుంచి 70 ట్రాక్టర్లు, ఇతర వాహనాలను కృష్ణ మండలం వాసునగర్ చెక్‌పోస్ట్ వద్ద దాదాపు 150 మంది రైతులు అడ్డుకున్నారు. తమ ధాన్యాన్ని తెలంగాణలో అనుమతిస్తే.. తెలంగాణ వాహనాలను కర్ణాటకలోకి పంపిస్తామని రైతులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12:30 వరకు ఏ ఒక్క అధికారి కూడా సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.
చెన్నారావుపేట, డిసెంబర్ 19: యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సహకార సంఘం వద్ద మంగళవారం క్యూకట్టారు. మక్కజొన్న పంటకు యూరియా కావాలని రోజుల తరబడి తిరుగుతున్నా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
యూరియా వేస్తేనే దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడే కొరత ఉంటే మరికొద్ది రోజు ల్లో వరి నాట్లు మొదలైతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి సరిపడా యూరియా ను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.