వనపర్తిలో హరీశ్‌రావు సభకు అనుమతులు రద్దు.. హైకోర్టుకు వెళ్తామన్న నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్‌రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది.
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్‌రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది.
వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ నెల 9వ తేదీన హరీశ్‌రావు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అకస్మా్త్తుగా గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.
హరీశ్‌రావు సభకు అనుమతులు రద్దు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని తెలిపారు. ప్రజలు, రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని తెలిపారు. తాము కేసులు, బెదిరింపులకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

