రోడ్లకు సర్కార్ ఖర్చు 935 కోట్లే!
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలైంది. రెండున్నరేండ్ల తన పాలనాకాలంలో కేవలం రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసి తన అశక్తతను వెల్లడించింది.
- రెండున్నరేండ్లలో కాంగ్రెస్ తీరు
- అనుమతులు 7,600 కోట్లు
- వేలాది కోట్ల మేర ప్రణాళికలు
- ఒక్కటీ అమలుకు నోచని వైనం
- చేసినవన్నీ కేంద్రం నిధులతోనే
- సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడి
హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలైంది. రెండున్నరేండ్ల తన పాలనాకాలంలో కేవలం రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసి తన అశక్తతను వెల్లడించింది. పరిపాలనా అనుమతులు మాత్రం ఘనంగా రూ.7,600 కోట్లకు ఇచ్చిన స ర్కార్.. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు సాగలేదు. ఫలితంగా అతి తక్కువ నిధుల విలువైన పనులే రాష్ట్రంలో జరిగాయి. అవి కూడా కేంద్రం నిధులతో జరిగినవే చాలా వరకు ఉండటం గమనార్హం. ప్రభుత్వం తా జాగా విడుదల చేసిన సోషియో ఎకనమిక్ సర్వే-2026 నివేదికలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 68,709 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 30 జాతీయ రహదారులు కలిపి 1,29,017 కిలోమీటర్ల మేర రోడ్ల నెట్వర్క్ విస్తరించి ఉన్నది.
ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 115.11 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.7,327 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా 1,720 కిలోమీటర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేయాలని, 41 బ్రిడ్జిలు నిర్మించాల ని నిర్ణయించి 253 పనులు మంజూరు చేసిం ది. ఇవికాకుండా గిరిజన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం మరో రూ.275.58 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు ప్లానింగ్ నిధుల కింద రూ.657.83 కోట్లు, ప్రణాళికేతర నిధుల కింద రూ. 276.9 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో రోడ్ నెట్వ ర్క్ అభివృద్ధికి రూ.7,602.58 కోట్లకు సుమా రు రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎకనమిక్ ఔట్‌లుక్‌ను బట్టి స్పష్టమైంది.
ప్రచారానికే పరిమితమైన హ్యామ్, ట్రిపుల్ ఆర్
హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) ప్రాజెక్టులో భాగంగా 12,000 కి.మీ. మేర రోడ్ల విస్తరణ, పటిష్టపర్చడం, నిర్వహణ తదితర పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ.12,696 కోట్లతో 6,080 కి.మీ. మేర పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఫేస్-2లో 3,125 కి.మీ, ఫేస్-3లో 2,800 కి.మీ. మేర పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. వీటికి గత ఆరు నెలలుగా ఎటువంటి పురోగతి లేదు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీసి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో ముందుగా ఉత్తర భాగంలో సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లె, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయ్‌గిరి, తంగడపల్లె (చౌటుప్పల్) వరకు 161.52 కి.మీ. మేర నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
దీన్ని ఎన్‌హెచ్-161 ఏఏగా నోటిఫై చేసినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి రూ.8,535 కోట్లు ఖర్చవుతుందని, ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతున్నదని తెలిపారు. మోర్త్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించినట్టు చెప్పారు. దక్షిణ భాగం విషయంలో చౌటుప్పల్ నుంచి ఆమన్‌గల్, సంగారెడ్డి వరకు సుమారు 201 కి.మీ. మేర రోడ్డు నిర్మించేందుకు అలైన్‌మెంటు రూపొందించి కేంద్రానికి పంపినట్టు తెలిపారు. ఇంతకుమించి ఎటువంటి పురోగతి లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హ్యామ్రోడ్లు, ట్రిపుల్ ఆర్ ప్రాజక్టులను గేమ్‌చేంజర్‌గా పదేపదే చెబుతున్నా.. వాటికీ అతీగతీ లేకుండా పోయింది.
కేంద్ర ప్రాజెక్టులు ఇవే..
- 2023 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ద్వారా రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.11,558 కోట్లు మంజూరైనట్టు వెల్లడించారు. ఇందు లో భాగంగా 1,002 కిలోమీటర్ల రోడ్లు ని ర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 861 కి. మీ. పూర్తికాగా, రూ.15,564 కోట్లు వ్యయం అయినట్టు పేర్కొన్నారు.
- ఎన్‌హెచ్-65 పరిధిలో ఆరు లేన్ల బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్, ఎన్‌హెచ్-163లో భాగమైన నాలుగు లేన్ల అంబర్‌పేట ఫ్లైఓవర్, ఎన్‌హెచ్-44లోని ఆరాంఘర్-శంషాబా ద్ మార్గంలో ఆరు లేన్ల ఫ్లైఓవర్, ఎన్‌హెచ్-167లోని మహబూబ్‌నగర్-జడ్చర్ల సెక్షన్లో నాలుగు లేన్ల ఫ్లైఓవర్, ఎన్‌హెచ్-61లోని నిర్మల్-ఖానాపూర్ సెక్షన్లో పేవ్డ్ షోల్డర్లతో కూడిన రెండు లేన్ల రహదారి, ఎన్‌హెచ్-363లో రేపల్లెవాడ-తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు నాలుగు లేన్ల రహదారి, ఎన్‌హెచ్-365-ఏలోని కోదాడ-ఖమ్మం సెక్షన్లో నాలుగు లేన్ల ర హదారి, ఎన్‌హెచ్-365 బీజీలోని ఖమ్మం-దేవరపల్లె సెక్షన్లో నాలుగు లేన్ల రహదారి నిర్మించినట్టు తెలిపారు.
- ఎన్హెచ్ఏఐ, స్టేట్ ఆర్అండ్బీ సంయుక్తాధ్వర్యంలో సుమారు రూ.34,530 కోట్ల వ్యయంకాగల సుమారు 1,800 కి.మీ. మేర 58ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు, కొన్ని టెండర్ల దశలో ఉన్నట్లు చెప్పారు.
- ఎన్హెచ్ఏఐ పరిధిలో మరో 31,990 కోట్లతో 443 కిలోమీటర్ల ఆరులేన్ల రహదా రి పనులు పైప్‌లైన్‌లో ఉన్నాయన్నారు. ఎన్‌హెచ్- 765లో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్, ఎన్‌హెచ్-65లోని హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఆరులేన్ల విస్తరణ, హైదరాబాద్-బందర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం భాగస్వామ్యంలో డిసెంబర్ 2023 నుంచి మార్చి 2025వరకు 98కిలోమీటర్ల మేర 22రోడ్లు, 26బ్రిడ్జీలను నిర్మించినట్లు, వీటికి 129.77కోట్లు ఖర్చయినట్టు, 2025-26లో 210కోట్లతో 66 కి.మీ మేర 23రోడ్లు, 27బ్రిడ్జీలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
- సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సీఆర్ఐఎఫ్) కింద డిసెంబర్ 2023నుంచి నవంబర్ 2025వరకు 857.65కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ. 1718కోట్లతో 65పనులు మంజూరు చేసినట్లు, ఇందులో ఇప్పటివరకు 835.96కోట్లతో 432కి.మీరోడ్ల పనులు పూర్తయ్యాయన్నారు.
- పీఎంజీఎస్‌వై కింద 2025-26లో 958 కి.మీ మేర 236 రోడ్లు, 104 బ్రిడ్జీల నిర్మాణానికి 631 కోట్లు మంజూరు కాగా, 210 కోట్లతో 310 కి.మీ. మేర 83 రోడ్లు, 42బ్రిడ్జీలను పూర్తిచేసినట్లు తెలిపారు.
- పీఎం జేఏఎన్ఎంఏఎన్ కింద 25 రోడ్లు, 25 రోడ్లు, 15 బ్రిడ్జీల నిర్మాణానికి డీపీఆర్‌లు పంపినట్టు తెలిపారు.
- స్టేట్ గ్రాంట్ నిధులతో విజన్కింద 2025-26లో 4,406 కోట్లతో 3,900 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించి, రూ.489 కోట్లతో 280 కిలోమీటర్లమేర రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.
రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ వివరాలు (కి.మీ.)
- 68,709 (53.2%) పంచాయతీరాజ్ రోడ్లు
- 12,936 (10.0%)క్యూర్ పరిధిలో
- 4,983 (3.9%)జాతీయ రహదారులు(ఎన్‌హెచ్)
- 29,075 (53.2%)ఆర్అండ్బీ రోడ్లు
- 13,314 (10.3%)క్యూర్ వెలుపలి ఇతర పట్టణ స్థానిక సంస్థలు
- 1,29,017 మొత్తం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

