హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మరో రూ.1000 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ-వేలంలో భాగంగా 30న జరిగే వేలంలో ఈ మొత్తం సేకరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ తమకు ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 11 ఏండ్ల కాలానికి రూ.1000 కోట్లు అప్పు తీసుకొనేందుకు సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టు పేర్కొన్నది. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రుణ సమీకరణ లక్ష్యం రూ.54,009 కోట్లు కాగా, ఈ నెల 23వ తేదీ నాటికే రూ.68,300 కోట్లు ఒక్క ఆర్బీఐ నుంచే సమీకరించారు.
రుణ పరిమితి పెంచాలని, పాత రుణాల రీషెడ్యూలింగ్కు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం అంగీకరించింది. 2025-26 సంవత్సరానికి రూ.71,400 కోట్ల వరకు రుణాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రూ.68,300 కోట్లు పూర్తయినందున ఇంకా రూ.3,100 కోట్లు అప్పు తీసుకునే అవకాశం మాత్రమే మిగిలి ఉంటుంది. వీటిలో వచ్చే మంగళవారం తీసుకునేందుకు సిద్ధమైన రూ.1,000 కోట్లు పోగా, వచ్చే నాలుగు నెలల కాలానికి కేవలం రూ.2,100 కోట్లు మాత్రమే రుణ సమీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. ఎలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టకుండానే వార్షిక రుణ లక్ష్యానికి మించి రేవంత్రెడ్డి సర్కారు అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
2025-26లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం తీసుకున్న అప్పు
త్రైమాసికం అప్పు