హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
రాష్ట్రంలోని 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాలని కోరింది. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్లజెండాలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలుపాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రు లు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇం ద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, సీనియర్ నేతలు బాలమల్లు, కర్నె ప్రభాకర్ పిలుపునిచ్చారు.