హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో రూ.1,500 కోట్ల అప్పుగా తీసుకుంటున్నది. ఈ రుణాన్ని ఆర్బీఐ ఈ నెల 29న విడుదల చేయనున్నది. గత సెప్టెంబర్లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ ఒకటో తేదీన రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్నది.
ఇప్పుడు తాజాగా మరో రూ.1,500 కోట్లు అప్పు పొందనున్నది. ప్రతి నెలా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి అప్పు తీసుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటివరకు ఆర్బీఐ నుంచే 49,618 కోట్లు,. గ్యారెంటీలు ఇచ్చి రూ.25 వేల కోట్ల వరకు సేకరించింది. ఇప్పటివరకు రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.74,618 కోట్ల అప్పు చేసింది.
.