హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ కత్తి దూసింది. ఒకేసారి ఏకంగా 5వేల మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది. గురుకుల సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఔట్సోర్సింగ్ సిబ్బందిపై కక్షగట్టిన సర్కార్ మొత్తం సిబ్బందినే తొలగించింది. దీనివెనుక కాంగ్రెస్ కీలక నేత ఉన్నాడని జోరుగా ప్రచారం జరు గుతున్నది.
సొసైటీలో 204గురుకులాలు ఉన్నాయి. వాటిలో 5నుంచి ఇంటర్ వరకు బోధన కొనసాగుతున్నది. రెగ్యులర్ సిబ్బంది కాకుండా టీచింగ్, నాన్టీచింగ్తో పాటు హౌస్‌కీపింగ్, కుకింగ్ స్టాఫ్ ఇతరత్రా కలిపి మొత్తం 5వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన సేవలందిస్తున్నారు. వీరి సర్వీస్ కొనసాగించే ఆర్డర్స్ ఇవ్వకుండా రెండు నెలల పాటు ప్రభుత్వం పెం డింగ్‌లో పెట్టగా, వేతనాలు కూడా విడుదల చేయలే దు. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు.
అదే సర్కార్‌కు కంటగింపుగా మారింది. ఏప్రిల్ నుంచి మార్చి 31వరకు తా త్కాలిక సిబ్బంది సర్వీస్‌ను పునరుద్ధరిస్తూనే.. సిబ్బంది వేతనాల్లో భారీగా కోత విధించింది. ఒక్కో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగికి సగటున రూ.5వేల నుంచి 13వేల వరకు వేతనాన్ని కుదించింది. ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి వేతనాలు సవరించింది. తాజాగా ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్‌ను డిస్కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ కీలక నేత స్కెచ్‌లో భాగంగానే సిబ్బంది తొలగింపునకు కారణమని తెలుస్తున్నది. తాత్కాలికంగా రెండు నెలల పాటే తొలగిస్తున్నట్టుగా ఉన్నతాధికారు లు ఉత్తర్వులిచ్చినా, అది పైకి మాత్రమేనని తెలుస్తున్నది. ఏజెన్సీలతో కుమ్మక్కై నచ్చినవారిని, అనుయాయులను ఆయా పోస్టుల్లో భర్తీ చేసేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నారని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. సొసైటీలో అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగులు, సమాచార హక్కు కార్యకర్తలు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ వాటిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సదరు మైనారిటీ నాయకుడు సీఎంవో స్థాయిలో ఒత్తిడి తెచ్చి విచారణలు కొనసాగకుండా అడ్డుకుంటున్నారని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తాతాలికంగా తొలగించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సర్కార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీ రెసిడెన్షియల్ సూల్స్ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రాజమ్మద్ గురువారం ప్రకటన విడుదల చేశారు. 2నెలలపాటు పూర్తిగా ఆదాయం కోల్పోతే బతికేదెలా? కుటుంబాలను ఎలా పోషించాలి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకుని, ఏడాది పొడవునా వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జేఏసీ ఆధ్వర్యంలో 6న సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టిడిస్తామని హెచ్చరించారు. బాధిత ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలు సహా తరలిరావాలని పిలుపునిచ్చారు.