మహదేవపూర్(కాటారం), డిసెంబర్ 6: ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవా రం కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా జ యశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కో సం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను ఇచ్చి విస్మరించిందన్నారు. ఏం సాధించిందని విజయోత్సవాలు నిర్వహిస్తున్నదని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణం మాఫీ కొందరికే మాఫీ చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు హయాంలో సంతోషంగా ఉన్న రైతులకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం శా పంగా మారిందని చెప్పారు. రూ.100 కోట్ల తో పెద్దపల్లిలో సభ పెట్టి రాష్ట్రంలో అంద రూ సంతోషంగా ఉన్నారని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు.