హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిర్యుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇ చ్చింది. ఒకేసారి 12 ఏండ్ల వయోపరిమితి సడలింపును తొలగించింది. కొత్త గా వయో పరిమితిని పెంచలేదు. దీంతో రాష్ట్రంలో గరిష్ఠ వయోపరిమితి 34 ఏండ్లకే పరిమితమైంది. దీంతో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు 34 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో నాలుగేండ్లు అంటే 39 ఏండ్లలోపు వారే ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే పరిస్థితి కల్పించింది.
పీసీబీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో 20 అసిస్టెంట్ సైంటిస్ట్(అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు 18-34 ఏండ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులని కమిషన్ పేర్కొన్నది. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మే 25 వరకు గడువు ఉన్నదని కమిషన్ వెల్లడించింది.
టీజీపీఎస్సీ సర్కార్కు లేఖ రాసినా..
ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన 10ఏండ్లు, రేవంత్రెడ్డి సర్కా ర్ ఇచ్చిన రెండేండ్ల వయోపరిమితి సడలింపుల గడువు ముగిసిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత 2022లో పదేండ్ల సడలింపునిచ్చింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాతదానికి మరో రెండేండ్లు సడలింపు ఇస్తూ 2024లో జీవో విడుదల చేసింది. రెండేండ్ల కాలపరిమితి వి ధించింది. ఇటీవల ఈ గడువు ముగియడంతో గరిష్ఠ వయోపరిమితి 34 ఏండ్లకు తగ్గింది. గడువు పొడిగింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.