జనగామ : జనగామలో కాంగ్రెస్ గుండాలు(Congress goons) రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మంత్రి సీతక్క జనగామ పట్టణంలో (Janagama) పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంఎల్ఏ పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. మంత్రి సమక్షంలోనే దాడికి యత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోసుకుంది. కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలకు మద్యం తాగించి దాడి చేయించారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు.