సికింద్రాబాద్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ (Congress) గూండాలు దాడులకు తెగబడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు.
కాగా, రుణమాఫీపై పోరుబాటపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా పరిషద్ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తున్న ఆమెను అరెస్టుచేశారు. ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను అడ్డుకున్నారు.
Chandar