యాదాద్రి భువనగిరి : రోజు రోజుకు కాంగ్రెస్ గుండాల (Congress goondas )ఆగడాలు రాష్ట్రంలో శృతి మించుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ సభలో కాంగ్రెస్ గుండాలు చెలరేగిపోయారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) ఎదుటే జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి(ZP Chairman Sandeep Reddy) పై దాడులకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరు(Guduru) గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఇదే సభలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం సరికాదని సందీప్ రెడ్డి తెలిపారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాధవరెడ్డి ఒక మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన సందీప్ రెడ్డి ఒక బచ్చా అన్నారు. కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ శ్రేణులు స్టేజీపైకి వచ్చి హంగామా సృష్టించారు. సందీప్ రెడ్డిని తోసి వేసి క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అతడిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.