Ex MLA Sampath Kumar : తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి (Mallu Ravi)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఫిర్యాదు చేశారు. ఎంపీ రవి తీరుపై ఆయన గురువారం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు కంప్లైంట్ చేశారు.
పార్టీ లైన్ క్రాస్ చేసి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే విజేయుడితో కలిసి ఎంపీ తిరుగుతున్నాడని సంపత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. మల్లు రవిని మందలించడంతో పాటు గాడిన పెట్టాలని మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలో సంపత్ విజ్ఞప్తి చేశారు.