నల్లగొండ సిటీ, జూన్ 05 : కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గురువారం మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలభోగనివేదిక, ధ్వజారోహన, దేవి మూలమంత్ర హోమములు, మండల పూజలు, నీరాజన మంత్రపుష్పములు, మహ నివేదన, గవ్యాంత పూజలు, వాస్తుపూజ, విఘ్నేశ్వర పూజలు, స్వస్తి వాచనములు, పంచగవ్య ప్రాశవ, అఖండ దీపారాధన, దీక్షాధారణ, నీరాజన పుష్పముల పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జయరామయ్య తెలిపారు. వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాట్రోగఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కల్యాణం అనంతరం సాయంత్రం అమ్మవారి విగ్రహ ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు నగేశ్ గౌడ్, నవీన్ గౌడ్, శంకర్‌రెడ్డి, రాజు, రమేశ్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రంగౌడ్, నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు, అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యులు, గాదె మహేశ్, దామోదర్‌రావు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.