హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌ది గందరగోళ పాలన అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. ఖజానాను ఖాళీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తమ పాలన వైఫల్యాలను ఎన్నో రోజులు దాచలేరని విమర్శించారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యానికి తెలంగాణ రాష్ట్రమే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. మోసపూరిత హామీలు, ఖజానాను ఖాళీ చేయడం, హామీల అమలులో చేతులెత్తేయడం.. ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.