కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 25 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీతో చెప్పించిన యువ డిక్లరేషన్‌లో ఏడా ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క టీ అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ నిరుద్యోగులు, యువత గురించి మాట్లాడకుండా ఎంత సేపూ కేసీఆర్‌ను విమర్శించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా మూడు ప్రాంతాల్లో తిరిగి ప్రచారం చేసిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమేనని ఎద్దేవాచేశారు. తెలంగాణ అమరవీరులను గుర్తించి జాబితా ప్రకటిస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని, ఆ కుటుంబాలకు ఉద్యోగంతోపాటు రూ.25 వేల పింఛన్ ఇస్తామని చెప్పి వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సీఎం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై తీవ్రస్థాయి విమర్శలు చేసి.. కిషన్‌రెడ్డి, సంజయ్‌ను మిత్రులు, సోదరులు అని సంబోధించడంతోనే వారి కుమ్ముక్కు రాజకీయాలను అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టా రు. కాంగ్రెస్ మునిగిపోయే పరిస్థితి లో ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్థానమే దక్కుతుందని జోస్యం చెప్పారు.
భైంసా, ఫిబ్రవరి 25 : నిర్మల్ జిల్లా భైంసాలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తెల్లకల్లు వ్యాపారం విషయమై వ్యాపారి సుభాష్‌గౌడ్ వద్ద ఎక్సైజ్ ఎస్సై నిర్మ ల, కానిస్టేబుల్ సుజాత రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.