ఇందల్వాయి/యాదాద్రి/రాజాపూర్, ఏప్రిల్ 15: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్ర వారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సర్పంచ్ పాశం సత్తెవ్వ నర్సింలు, మాజీ సొసైటీ చైర్మన్ పాశం నర్సింలు టీఆర్ఎస్లో చేరగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన వందమంది మహిళలు, యువకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో చేరారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్, రంగారెడ్డిగూడ, ఈద్గాన్పల్లికి చెందిన 30మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నందున పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.