హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయి. ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను సాకు గా చూపుతూ రాష్ట్రంలో రెండు పార్టీలు బుధవారం పోటాపోటీ బలప్రదర్శనకు దిగాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ పేరిట కాంగ్రెస్ ఓవైపు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ మరోవైపు నిరసనలకు దిగడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నీట్‌పై ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం కార్యాలయా లు, నివాసాల ముట్టడికి దిగడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నిరుద్యోగం, రైతు సమస్య లు, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై దృష్టిపెట్టాల్సిన జాతీయ పార్టీలు బల ప్రదర్శనకు దిగడంపై జనం మండిపడుతున్నారు.
ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్‌భవన్’ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ నాయకత్వంలో భారీ ర్యాలీ తీశారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు పాల్గొన్నా రు. లోక్‌భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మహేశ్కుమార్పాటు మంత్రులు, నాయకులను అదుపులోకి తీసుకొని వాహనాల్లో తరలించారు.
మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కా ర్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గాంధీభవన్ ముట్టడికి బయలుదేరాయి. పోలీసులు వారి ని మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే సమయంలో గాంధీభవన్ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించ గా పోలీసులు రాంచందర్‌రావుతోపాటు ప లువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు నాంపల్లిలో రోడ్డుపైనే బైఠాయించి ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. బీజేపీ కార్యాలయం, గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇరుపార్టీ ల నాయకు ల దాడుల్లో ఓ టీవీ చానల్ రిపోర్టర్ ప్రవీణ్ గాయపడ్డాడు. తల పగిలి రక్తం కారుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజ య్ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, బీజేపీ కార్యకర్తలు భారీగా అకడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసు లు పరిస్థితిని అదుపు చేసినా కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కోర్టు సమీపంలోనే అరెస్టు చేయగా, మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్‌కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రె డ్డి, కార్పొరేటర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నా రు. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించారు. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫి ర్యాదు చేశారు. సాయంత్రం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు హనుమకొండలో నిర్వహించిన ఆందోళనలో డిప్యూ టీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమస్యలను వదిలేసి రాజకీయ విన్యాసాలకు దిగడంపై జనం మండిపడుతున్నారు.