జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలనుంచి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున యువకులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోర్లకుంట రాజు, సురేష్, రాజేశ్, కోశాధికారి రాకేశ్, కందుకూరి నవీన్, జక్కుల మల్లయ్య, గుగ్గిల మహేశ్, కంది రాకేశ్, బట్టల కాంతయ్య, తదితరులు ఉన్నారు.