భద్రాచలం కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi
— Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాంగా ముందుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్ దంపతులేనని మంత్రి ప్రశంసించారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కలెక్టర్ దంపతులకు గ్రీటింగ్స్ తెలిపారు.
#BhadradriKothagudem జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు పొంది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన @Collector_BDD @anudeepd7, మాధవి గార్ల దంపతులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొర్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన @TelanganaCMO కేసీఆర్ గారు.@MinisterKTR @KTRTRS pic.twitter.com/rIfsNqbWgl
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) November 10, 2021
ఇవి కూడా చదవండి..
బ్యూటీఫుల్ తెలంగాణ.. యూఎన్ ప్రశంసలు
మలాలా యూసఫ్‌జాయ్ భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా ?
Raj Kundra: బెయిల్ నుండి బయటకు వచ్చాక తొలిసారి కెమెరాకి చిక్కిన రాజ్ కుంద్రా