హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : సివిల్స్‌లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. గురువారం ఆమె తల్లిదండ్రులు రాజు, రజితతో కలిసి బస్‌భవన్‌లో వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలువగా, ఆయన సాయి శివానిని సత్కరించారు.
సాయి శివాని మేనమామ ప్రకాశ్‌రావు ఆర్టీసీలో డీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.