హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి గురువారం ఆయనను సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన వెంట పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి, నాయకులు పేరి వెంకట్‌రెడ్డి, రాజాగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్ ఉన్నారు. అలాగే రామకృష్ణారావుకు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ టీ శుభాకర్‌రావు, కో చైర్మన్ సూర్యనారాయణ, రాజేంద్రబాబు, జ్ఞానేశ్వర్, తులసి, సత్య5/1/2025 10:11:33 PMనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేద్దామని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన చాంబర్లో పదవీ బాధ్యతలను చేపట్టారు.