హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది. అయితే.. ప్రమో షన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతున్నది. దీంతో ప్రభు త్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆప్షన్లకు దూరంగా ఉండాలని మెజారిటీ వీఆర్వో లు, వీఆర్ఏలు నిర్ణయించినట్టు తెలిసింది.