హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రామంతపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధారించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా ఆ ప్రక్రియను పూర్తిచేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. ఈ ప్రక్రియకు ముందు అక్కడి నివాసితులతోపాటు ఇంప్లీడ్ పిటిషనర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, ఆ తర్వాతే ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పష్టం చేసింది. ఆ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేస్తూ.. రామాంతపూర్ పెద్దచెరువుపై 2005లో దాఖలైన పిటిషన్పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.