ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించండి
వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
- మే 10 నుంచి జూన్ 1 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ
- సిబ్బందికి మొబైల్ అనుమతి లేదు
- కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
- అధికారులతో మంత్రి సబిత సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ఫోన్లతో అనుమతించొద్దని సూచించారు. వచ్చే నెల 10 నుంచి జూన్ 1 వరకు జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం మంత్రి సబిత హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమీక్షించారు.
పరీక్షాకేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అన్ని రకాల ఏ ర్పాట్లపై ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాలను ముందే తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుడు ఎంసెట్ పరీక్షకు 2,66,719 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 3,18,018 దరఖాస్తులొచ్చాయని, ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరీక్షల నిర్వహణపై ఎక్కడా రాజీపడొద్దని, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు పాటించే జాగ్రత్తలను హాల్‌టికెట్లపై ముద్రించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

