Rajiv Ratan | రాజీవ్ రతన్‌కు పోలీస్ అధికారుల సంతాపం.. రేపు షేక్‌పేట మహాప్రస్థానంలో అంత్యక్రియలు
Rajiv Ratan | విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మరణం పట్ల పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
అమరావతి : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ (Rajiv Ratan) మరణం పట్ల పోలీస్ అధికారులు (Police Officers) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ఏఐజీ ఆసుపత్రి లో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్(IPS) అధికారులు ఆసుపత్రికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
రాష్ట్ర డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) , ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి .శివధర్ రెడ్డి, రైల్వేలు, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు రాజీవ్ రతన్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
బుధవారం మధ్యాహ్నం షేక్‌పేట(\Shaikpeta) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ కరీంనగర్ జిల్లా ఎస్పీ గా, హైదరాబాద్ రీజియన్ ఐజీగాను , అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ గాను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గాను పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో ఆయన ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

