హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు మార్చిలో శంకుస్థాపన చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గం గుల కమలాకర్ ప్రకటించారు. ఉప్పల్ భగాయత్, కోకాపేట, మేడ్చల్‌లో కేటాయించిన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి 14 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల పట్టాలు అందజేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 41 కులాలకు హైదరాబాద్‌లోని విలువైన ప్రాంతాల్లో 82 ఎకరాలను కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ నిధులకు మరికొంత కలిపి, సకల వసతులతో భవనాలను నిర్మించకొనేందుకు కొన్ని సంఘాలు ముందుకొచ్చాయని, ఇందుకు సీఎం కేసీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివరించారు. ఒకే కులానికి చెందిన సంఘాలన్నీ ఏకతాటిపైకివచ్చి ట్రస్టుగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 15లోగా మిగతా కులాలు కూడా ఏకతాటిపైకి వస్తే వాటికి కూడా భూ పట్టాలను అందజేస్తామని, లేని పక్షంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) ద్వారా ఆత్మగౌరవ భవనాలను నిర్మిం చి ఇస్తామని చెప్పారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. బీసీ ప్రధాని పాలనలో బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశా ఖ లేకపోవడం, నిధులను కేటాయించకపోవడం శో చనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఆర్ఎస్ నేతలు పర్యాద కృష్ణమూర్తి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పలు సంఘాల నేతలు కొంటు ముకుందం, ప్యారసాని బాలరాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీరశైవ లింగాయత్ బసవ భవనం భూమి పత్రాలు అందజేయటంపై ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతులమీదుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత్, వైస్‌చైర్మన్ వీరమల్లేశ్, రుద్రమదేవి, ఈశ్వర్ప్రసాద్, కోట గండప్ప ఎకరం భూమికి సంబంధించిన హక్కు పత్రాలు అందుకొన్నారు.
ఎల్లాపి/ఎల్లాపు, మేదరి/మహేంద్ర, పూసల, రంగ్రీజ్/భావసార, అగర్వాల్ సమాజ్, నీలి, జాండ్ర, వీరశైవ లింగాయత్, చాత్తాద శ్రీవైష్ణవ, దేవాంగ, పట్కర్, లక్కమర్రికాపు, మేర, భట్రాజు కులాలకు పట్టాలను అందజేశారు.
కుల సంఘ భవనం కోసం గత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశ య్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసినా పట్టించుకోలేదు. మేం అడగకుండానే సీఎం కేసీఆర్ ఉప్పల్ భగాయత్‌లో ఎకరం స్థలాన్ని కేటాయించి, కోటి రూపాయలు, పట్టా అందజేశారు. మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఈ స్థలంలో వసతిగృహం, పోటీపరీక్షల శిక్షణా కేంద్రం, వృత్తినైపుణ్య కేంద్రం, కల్యాణమండపాన్ని నిర్మిస్తాం.
– వెంకట్రాముడు, మేదరి,మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ వచ్చాకే మా కులానికి న్యాయం జరుగుతున్నది. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ మా కులానికి స్థలాన్ని కేటాయించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థలాన్ని కొనడం, ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించడం మాకు సాధ్యపడేదికాదు. ప్రభుత్వమే మాకు స్థలాన్నిచ్చి, నిధులను కేటాయించడం పెద్ద ఊరట కలిగించింది. ఈ స్థలంలో మా పిల్లల కోసం హాస్టల్, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం.
– అనూప్‌కుమార్, జాండ్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు