హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లితున్నది. సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదవులు చేపట్టగానే ఇచ్చిన హామీలు గాలికొదిలేసి నమ్మి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని(Grain purchase), రుణమాఫీ చేయాలని, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ(BRS) ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనతో భారీగా జగిత్యాల-కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు.