బాన్సువాడ రూరల్, జనవరి 26 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపాల్, ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతిచెందింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం బీఆర్ఎస్ నాయకులు బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు.
మద్దతుగా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల గేటు ఎదుట బైఠాయించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా ఆటోడ్రైవర్, ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల సహాయం కోసం సీఎం నిర్ణయించారని వెల్లడించారు.