కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ బెజ్జూర్, డిసెంబర్ 21 : ‘అధికారుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ చనిపోయింది. న్యా యం చేసే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదు’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థిని(డీఎడ్) వెంకటలక్ష్మి(19) కుటుంబసభ్యులు ఆం దోళనకు దిగారు. బెజ్జూర్ మండలం అందుగులగూడలో వెంకటలక్ష్మి ఇంటి వద్ద మృతదేహం తో శనివారం ఆందోళన చేపట్టారు. కూతురు మృతిపై సమాచారం ఇవ్వలేదని, రాత్రికి రాత్రే బిడ్డ మృతదేహాన్ని ఇంటికి పంపించారని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తంచేసింది. మృతదేహంతో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధం కాగా కౌటాల సీఐ ముత్యం రమేశ్‌తోపాటు ఎస్ఐలు ప్రవీణ్, నరేశ్, మధూకర్ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు రాంప్రసాద్, సారయ్యను స్టేషన్‌కు తరలించా రు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్యాంరావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శుక్లా శ్రద్ధా వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా విద్యార్థిని మృతికి కారణమైన వార్డెన్ నిఖత్‌ను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సస్పెండ్ చేశారు.