హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని గ్రాడ్యుయేట్ ఏఈవో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖలో ఏఈవోలుగా పనిచేస్తూ.. ఉద్యోగోన్నతుల కోసం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న కొంతమంది కాలేజీ సిబ్బందితో కుమ్మక్కై పేపర్‌కు రూ.50వేలు చెల్లించి లీకేజీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎలాంటి ప్రవేశపరీక్ష లేకుండానే ఉచితంగా రూ.35లక్షల సీటును కేటాయించడంతో పాటు ఏఈవోలకు నెల జీతం కింద సర్కార్ లక్ష చెల్లిస్తున్నదని తెలిపారు. ఏఈవోలు చ దివేందుకు వెళ్లినప్పుడు వారి ప్లేస్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించి వా రికి రూ.25వేల వేతనం ఇస్తున్నదని గుర్తుచేశారు. దీనికి రూ.12లక్షలు అవుతున్న ట్టు వివరించారు.ఈ మొత్తం కలిపి ఇన్ సర్వీస్ ఏఈవోలు చదవడానికి ప్ర భుత్వం రూ.కోటి ఖర్చు చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీ ఘటనలో అడ్డంగా దొరికిన వారిని ప్రభుత్వం వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాల ని,ఇప్పటికే ఉద్యోగోన్నతి పొందిన వారిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.