హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండీఆర్.మై డీజీ రికార్డ్’ మొబైల్ యాప్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రోగులకు అదనపు ఆర్థికభారాన్ని నివారించేందుకు హెల్త్ ప్రొఫై ల్ దోహదపడుతుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాడ్యూర్ హాస్పిటల్స్ సర్వీసెస్ చైర్మన్ మోటూరి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : ఆయిల్‌పామ్ సాగులో రా ష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ని లుపాలని, ఇందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన ఆయిల్‌పామ్ సాగు పై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. మార్చి నెలలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆ యిల్‌పామ్ యూనిట్ నిర్మాణాన్ని జూన్‌లోగా పూర్తి చేసి ప్రాసెసింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు, పవర్లూమ్ పరిశ్రమకు నిరంతరాయంగా వి ద్యుత్తు సరఫరాను అందించాలని సెస్ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. చేనేత అభయ హస్తం పథకంలో భాగంగా టెసోకు ఇప్పటిదాకా వస్త్ర ఇండెంట్లు సమర్పించని శాఖలపై చర్య లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.