హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : భాషా పండితుల అప్గ్రేడెషన్లో మిగిలిపోయిన వారికి ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ(ఆర్‌యూపీపీ టీజీ) ప్రభుత్వాన్ని కోరింది.
వెయ్యి వరకు భాషాపండితుల పోస్టుల ఉన్నతీకరణ ఫైల్‌ను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ ప్రకటనలో కోరారు. తాజాగా విడుదల చేసిన పదోన్నతుల షెడ్యూల్లోనే తెలుగు, ఉర్దూ, హిందీ తదితర భాషాపండితులకు పదోన్నతులు కల్పించాలని వారు విన్నవించారు.