హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని శాసనపరిషత్ భవనం పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులతో కలిసి శాసనపరిషత్ భవన పునర్నిర్మాణ పనులను చైర్మన్ సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు. శాసనపరిషత్ భవనం హెరిటేజ్ భవనం అయినందున జాగ్రత్తగా పనులు చేపట్టాలని సూచించారు. రానున్న సమావేశాలు ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని వెల్లడించారు. అనంతరం ఆర్అండ్బీ, ఆగాఖాన్ సంస్థ ప్రతినిధులతో స్పీకర్ చాంబర్లో సమీక్ష నిర్వహించారు.