
వనస్థలిపురం, డిసెంబర్ 31: సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేశారు. పసుపుబోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు అర్వింద్ అని విమర్శించారు. 24 గంటల్లో కేసీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే అర్వింద్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.