సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై(KCR) సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో పోస్ట్(Social media) చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం సిద్దిపేట జిల్ల మద్దూరు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల యూత్ అధ్యక్షుడు బడుగు సాయిలు ఆధ్వర్యంలో పలువురు యూత్ నాయకులు ఏఎస్సై జగదీశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బడుగు సాయిలు మాట్లాడుతూ.. ఫేస్బుక్లో ఆదిత్యచౌదరి రాయుడు అనే వ్యక్తి మద్యం సీసాలతో కూడిన కుర్చిలో కూర్చున్నట్లు కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు తెలిపారు.
కేసీఆర్‌ను ఎంతగానో అభిమానించే తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా సదరు పోస్ట్ ఉందని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మద్దూరు మండల యూత్ అధ్యక్షుడు గూడ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పోతుగంటి రవీందర్, ఉమ్మడి మద్దూరు మండల సోషల్ మీడియా ఇన్చార్జి పాకాల కిరణ్‌కుమార్, యూత్ నాయకులు పిడిశెట్టి గౌరీశ, నల్ల అమర్ తదితరులు పాల్గొన్నారు.