నాంపల్లి క్రిమినల్ కోర్టులు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండదండలతో నిర్వహిస్తున్న డిజిటల్ పత్రిక ‘తెలంగాణ స్ర్కైబ్’ బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని పెంచేలా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రేయారెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.