కలెక్టర్ క్రాంతి అక్రమాలపై ఫిర్యాదు
గతంలో జోగుళాంబ గద్వాల కలెక్టర్‌గా పనిచేసి.. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వల్లూరు క్రాంతి అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు సీఎస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
- సీఎస్ కార్యాలయంలో గద్వాల కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
గద్వాల, జూన్ 15 : గతంలో జోగుళాంబ గద్వాల కలెక్టర్‌గా పనిచేసి.. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వల్లూరు క్రాంతి అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు సీఎస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అప్పటి ప్రజాప్రతినిధులకు సహకరిస్తూ.. తన తండ్రి ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించి అధికార దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడిన వల్లూరు క్రాంతిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కౌన్సిలర్లు షేక్ శావలి, శంకర్, నేతలు ఇసాక్, గౌస్, రాజేంద్ర, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి తదితరులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయా మండలాల్లో పేద రైతుల భూ రికార్డులు సరిగ్గా ఉన్నా లేవని, లేని వాటిని సరిచేసేందుకు తన తండ్రి ద్వారా ఆర్థిక లావాదేవీలు నడిపి రికార్డులు మార్చి పాస్‌పుస్తకాలు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వలేని రైతుల వినతులను పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించారు. అలాగే నిషేధిత జాబితాలలో నుంచి వందల ఎకరాల భూమిని తొలగించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

