హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. కార్పొరేట్ శక్తులకు, టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యుల ఆత్మగౌరవానికి మధ్య పోటీలాంటిదని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ బలపరిచిన కార్పొరేట్ యాజమాన్యాల అభ్యర్థికి ఉపాధ్యాయ, అధ్యాపకవర్గాలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ టీచర్స్ జేఏసీ, పీఆర్టీయూ టీఎస్ తరఫున గుర్రం చెన్నకేశవరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ,
సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకొని టీచర్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, టీటీజేఏసీ నేతలు ఎండీ అబ్దుల్లా, రాఘవరెడ్డి, విద్యాసాగర్, కనక చంద్రం, జగదీశ్, దయాకర్, కుత్బుద్దీన్, దిలీప్ రెడ్డి, రిషికేశ్ కుమార్, స్వరూప, మాతలి, ఫాతిమా, శ్రీనివాస్, ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.