హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్లో భూము లు కోల్పోయిన రైతులకు పునరావాసం, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్రయోజనా లు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు ప్రతి అందిన ఆరు వారా ల్లో పరిహారం అందజేయాలని, అప్పటివరకు భూములనుంచి వారిని ఖాశీ చేయించరాదని స్పష్టంచేసింది.
అనంతగిరి రిజర్వాయర్ కోసం చేపట్టిన భూసేకరణను సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన సీహెచ్ ల క్ష్మారెడ్డి మరో 29 మంది రైతులు 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు వెలువరించారు. పునరావాస ప రిహారం చెల్లించామని అధికారులు చెప్తున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపలేదన్నా రు. సేకరించిన భూములకు పునరావాస ప్రయోజనాలు కల్పించేదాకా ఖాళీ చేయించరాదని హైకోర్టు 2018లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా ఉల్లంఘించడంతో కోర్టు ధికరణ కింద శిక్ష విధించిందని చెప్పారు.