హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ): ప్రమాదాల్లో మరణించిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్‌కుమార్, లీగల్‌సెల్ బాధ్యులు కల్యాణ్‌రావు, హరీశ్, వేణుగోపాల్‌రావు, రవీనా పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడికి కుటుంబానికి ఆర్థికసాయం
ఇటీవల మృతిచెందిన తెలంగాణ ఉద్యమకారుడు బొంరాస్‌పేట మండలానికి మోనాచారి కుటుంబ సభ్యులను కేటీఆర్ స్వయంగా కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేసి, కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.