ఆదాయ మార్గాల అన్వేషణలో ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనికోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది.
- బస్టాండ్లలో షాపులు, పార్కింగ్‌ల కోసం టెండర్లు
- ఖాళీ భూముల లీజుకు దరఖాస్తులు
- టెండర్ల దాఖలుకు మార్చి 15 తుది గడువు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనికోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజయన్ల పరిధిలో ఉన్న జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలోని స్థలాలు, స్టాళ్లు, దుకాణాలను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం వేర్వేరుగా ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో కూడా గతంలోనే టెండర్లను పిలిచినా, మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కాచిగూడ, మేడ్చల్, శామీర్‌పేట, హకీంపేట వంటి ప్రధాన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న భూములను అద్దెకు ఇచ్చేందుకూ సంస్థ సిద్ధమైంది. ఆ భూముల్లో అన్నిరకాల దుకాణాలు, హోటళ్లు, ఫుడ్ స్టాళ్లు, పారింగ్, లాజిస్టిక్స్ (కార్గో పార్సిల్ సేవలు), డార్మెటరీ, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లు, షోరూమ్‌లు, ఇన్ సిటీ వేర్ హౌజ్‌లు ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతున్నది. టెండర్ ప్రక్రి య, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఉదయం 10.30 నుంచి సాయం త్రం 5 వరకు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్‌ను 9959224433 నంబర్లో సంప్రదించాలని సంస్థ పేర్కొన్నది. ఆసక్తి గల వారు ఆన్లైన్లో ఈ -టెండర్లను దాఖలు చేయడానికి మార్చి 15వరకు గడువు నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

