Mahabubnagar IT Park | పాలమూరు ఐటీ పార్కులో ఇతర దేశాల కంపెనీలు.. అమెరికా కంపెనీతో పాటు మరెన్నో రాక
Mahabubnagar IT Park | మహబూబ్‌నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ వారి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిందని స్పష్టం చేశారు.
Mahabubnagar IT Park | మహబూబ్‌నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి ఐటీ కారిడార్‌లో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ వారి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను కలెక్టర్ రవినాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి మంత్రి పరిశీలించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు ఇక్కడకు రాబోతున్నాయని తెలిపారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే ఇక్కడకొచ్చి వారి కార్యకలాపాలను సిద్ధం చేసుకుంటామని చెప్పారన్నారు. దేశ విదేశాల్లో ఉండి పనిచేస్తున్న పాలమూరుకు చెందిన వాళ్లు ఇక్కడ ఉద్యోగాలు చేసేలా ఐటీ టవర్‌ను తీర్చిదిద్దుతామని వివరించారు. స్థానిక యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి మంచి ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
ఐటీ కంపెనీ కోసం సుమారు 400 ఎకరాల భూమిని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సేకరించామని తెలిపారు. మే 6వ తేదీన మంత్రి కేటీఆర్ పాలమూరు సమీపంలోని దివిటిపల్లి ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు విశాలమైన స్థలాన్ని ఆయా కంపెనీలకు అందించాలని కోరారు. వచ్చే మూడేండ్లలో కనీసం 30 వేల ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

