Academic Calendar | హైదరాబాద్ : వివిధ యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్, పీజీలోని 1, 3 సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం విడుదల చేశారు.
దీని ప్రకారం ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలంగాణ మహిళా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు అందరికీ ఒకేసారి తరగతులు ప్రారంభించి, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు వేర్వేరు అకాడమిక్ క్యాలెండర్లు అమలు చేసేవారు. దీనివల్ల ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో అన్ని వర్సిటీలకు కలిపి కామన్ క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు.
పీజీ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ (1, 3 సెమిస్టర్స్ వారికి)
తరగతులు ప్రారంభం – అక్టోబర్ 10
మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్ – డిసెంబర్ 22, 23 తేదీల్లో
రెండో ఇంటర్నల్ అసెస్మెంట్ – 2023 ఫిబ్రవరి 9,10 తేదీల్లో
తరగతుల ముగింపు – 2023 ఫిబ్రవరి 23
ప్రాక్టికల్స్, ప్రిపరేషన్ సెలవులు – 24-2-22 నుంచి 26-2-22
సెమిస్టర్ పరీక్షలు – 2023 ఫిబ్రవరి 27 నుంచి
మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్ డిసెంబర్ 8,9 తేదీల్లో
రెండో ఇంటర్నల్ అసెస్మెంట్ 2023 జనవరి 23, 24 తేదీల్లో
తరగతుల ముగింపు 2023 ఫిబ్రవరి 3
ప్రాక్టికల్స్, ప్రిపరేషన్ సెలవులు 04-02-2023 నుంచి 08-02-2023
సెమిస్టర్ పరీక్షలు 09-02-2023
నోట్ : డిగ్రీ తరగతులు అక్టోబర్ 10 నుంచే ప్రారంభమయ్యాయి.