హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంచేం దుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వం ఓ విచిత్ర నిర్ణయాన్ని తీసు కున్నది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అన్ని శాఖల్లో ప్రత్యేకంగా కమిటీలు వే యాలని నిర్ణయించింది. ఈ మేరకు డి ప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆయా శాఖ ల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. సచివాలయంలో సోమవారం ఆయ న రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య పన్నులు, మైనింగ్ శాఖల్లో మినహా మిగిలిన అన్ని శాఖల్లో రాబడి పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో 4.7%, మైనింగ్ శాఖలో 18.6% మేరకు రాబడి పెరుగు దల కనిపిస్తున్నదని తెలిపారు. సమావేశం లో కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తం కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరు లు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టివిక్ర మార్క మాట్లాడుతూ.. తలసరి ఆదాయం లో తెలంగాణ కర్ణాటక, హర్యానాను అధిగమించిందని, రూ.3.87 లక్షల ‘తలసిరి’తో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని చెప్పారు.