చేర్యాల, జూలై 16 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి భూములకు ఎసరు అనే కథనం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్ ఎడిషన్‌లో గురువారం ప్రచురితకాగా దేవాదాయ, ధర్మాదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం స్పందించింది. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అప్పటి సీఎం కేసీఆర్ ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు, వాటికి సంబంధించిన డ్యాకుమెంట్స్, ఆధీనంలో ఉన్న భూమి, ప్రస్తుతం చదును చేసి భూమి ఎన్ని ఎకరాలు ఉంది అనే అంశాల పై కమిషనర్ కార్యాలయం ఆరా తీసినట్టు తెలిసింది. మల్లన్న ఆలయ భూములకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని దేవాదాయశాఖ కార్యాలయానికి ఆలయ ఇన్చార్జి ఈవో సుధాకర్‌రెడ్డి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు వివరాలు అందజేసినట్టు సమాచారం.