హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడించారు. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో కమిషన్ చైర్మన్ అక్తర్ సోమవారం బాధ్యతలను స్వీకరించి మాట్లాడారు. ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన వినతులు, అభిప్రాయాలు, అభ్యర్థనలను ఎస్సీ సంఘాలు, వ్యక్తులు కమిషన్ కార్యాలయ పనివేళల్లో నేరుగా వచ్చి తెలపవచ్చని వివరించారు.
అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటాం
హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణ కోసం ప్రజలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో బహిరంగ విచారణ చేపట్టింది. చైర్మన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు లోబడి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ధారిస్తూ నివేదికను రూపొందిస్తామని వెల్లడించారు.