జనహృదయ నేత ఎన్టీఆర్
ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
- సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- రాజకీయాల్లో ఎన్టీఆర్ సేవలు అమోఘం: పువ్వాడ అజయ్
- ఎన్టీఆర్‌కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆరే : ఎర్రబెల్లి
ఖైరతాబాద్/ఖమ్మం/హనుమకొండ, మే 28: ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని ఘాట్ వద్ద ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసును గెలిచిన మహోన్నతుడని కీర్తించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి, పరిశ్రమలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని, ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటనానైపుణ్యంతో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. తెలంగాణ ప్రజల మనసు గెలిచారని చెప్పా రు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

