హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జూన్ 6న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ప్రతినిధులు ఆహ్వానించారు. నందినగర్ నివాసంలో శనివారం కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధులు ఆయనకు ఆహ్వాన లేఖ అందజేశారు. బీఆర్ఎస్ మలేషియా, మైటా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో మైటా అధ్యక్షుడు ఎస్ తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి, సభ్యులు సుప్రియ, అశ్విత, శివతోపాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.