న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మనుస్మృతి ఆవహించిందని కామెంట్ చేశారు. పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా మనుస్మృతి గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో అధికార బీజేపీ ఎంపీలు ఆయన్ను అడ్డుకున్నారు. బీజేనీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాలను ఖర్గే తప్పుపట్టారు. పేదలకు విద్య దూరం అవుతోందన్నారు. యూనివర్సిటీల్లో కీలక పదువులన్నీ ఆర్ఎస్ఎస్తో లింకున్నవారికే దక్కుతున్నాయన్నారు. స్కూళ్లు, యూనివర్సిటీల సిలబస్లో మార్పులు జరుగుతున్నాయని, మనుస్మృతి ప్రకారం ఆ మార్పులు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
“मनुस्मृति में लिखा है: जो शूद्र वेद सुने उसके कानों में शीशा डाल देना चाहिए, वेद का उच्चारण करने पर जीभ काट दी जाए, तथा वेद मंत्र धारण करने पर उसका शरीर काट देना चाहिए..”
खड़गे जी ने घृणित किताब का जिक्र जैसे ही किया सारे भाजपाई बिलबिलाने लगे! खड़गे जी मनुस्मृति का पोस्टमार्टम… pic.twitter.com/Pmtlzr3CXS
— Priyanka Bharti (@priyanka2bharti) July 30, 2026
విద్యా వ్యవస్థలో కుల వివక్షను మనుస్మృతి ప్రోత్సహించినట్లు ఖర్గే తన ప్రసంగంలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యల పట్ల అధికార సభ్యులు అభ్యంతర వ్యక్తం చేశారు. ట్రెజరీ బెంచ్ల్లో ఉన్న సభ్యులు ఖర్గే వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకుంటూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో సభాపక్ష నేత జేపీ నడ్డా జోక్యం చేసుకున్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో తప్పుడు సందేశాన్ని పంపుతాయన్నారు.
ఖర్గే తన స్టేట్మెంట్ను సరి చేసుకోవాలని, ఒరిజినల్ మనుస్మృతితో చెక్ చేసుకోవాలని నడ్డా అన్నారు. రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ చర్చలో మనుస్మృతి ప్రస్తావన సంబంధం లేని అంశమని, అధికారిక రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చెప్పారు.
Delhi: Leader of the House J.P. Nadda says, “We are listening to the Leader of the Opposition peacefully, and in a democracy, it is the government’s responsibility to do so. But I request the Leader of the Opposition not to speak in a fit of rage or use unparliamentary language.… pic.twitter.com/N5dKoPWOMe
— IANS (@ians_india) July 30, 2026